Sunday, 26 July 2026 11:12:08 PM
 BREAKING NEWS
     -> వాట్సప్‌ బదులుగా స్వదేశీ యాప్‌ అయిన అరట్టైను ఉపయోగించుకోవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది...      -> పాట్నా ఎన్నికల ప్రవర్తనా కోడ్ ఉల్లంఘన.. ప్రశాంత్ కిశోర్‌పై కేసు..      -> కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ సరికొత్త రికార్డ్.....      -> విశాఖకు పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయి... నగరం రూపురేఖలు మార్చాలి: మంత్రి నారా లోకేశ్..      -> అక్టోబరు 14న ఒక చారిత్రక ఒప్పందం కుదుర్చుకోబుతున్నాం: సీఎం చంద్రబాబు..      -> ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విస్తృత స్థాయి సమావేశం..      -> జడ్పీ పరిధిలో కారుణ్య నియామకాలు చేపట్టాలి..ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్‌..      -> రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రావు... ఉన్న వాటిని తరిమేస్తున్నారు : పోతిన వెంకట మహేష్..      -> వైసీపీలా అహంకారానికి పోవద్దని కార్యకర్తలకు గట్టి హెచ్చరిక : మంత్రి నారా లోకేశ్..      -> ఉత్తరాఖండ్ లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సీఎం పుష్కర్ సింగ్ ధామి విజ్ఞప్తి..      -> పూరీ రథయాత్రలో ఘోర విషాదం.. తొక్కిసలాట ఘటన ..      -> టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో పార్టీ క్యాడర్ కు చంద్రబాబు దిశానిర్దేశం..      -> విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో కార్మికుల 24 గంటల సమ్మె..      -> ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన యోగా గురు బాబా రామ్‌దేవ్..      -> హీరోలు సినిమా లైఫ్‌ని కాదు.. రియల్ లైఫ్‌ని ఆదర్శంగా తీసుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి..      -> బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. ఏపీలోని అన్ని జిల్లాల్లో వర్షాలు..      -> బెజవాడ కనకదుర్గ ఆలయంలో ప్రారంభమైన వారాహి ఉత్సవాలు.. ..

పూరీ జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది? 15 రోజులు దర్శనాల నిలిపివేత ఎందుకు?

పూరీ జగన్నాథుడికి జ్వరం ఎందుకు వస్తుంది? 15 రోజులు దర్శనాల నిలిపివేత ఎందుకు?


Date : 01 July 2026 09:13 PM Views : 76

వైజాగ్ లోకల్ న్యూస్ - ఆధ్యాత్మికం / : ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయంలో జరిగే దేవ స్నాన పూర్ణిమ రథయాత్రకు తొలి ఘట్టం. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవికి 108 పవిత్ర కుండలతో మహాస్నానం చేస్తారు. స్నానం అనంతరం స్వామివారికి జ్వరం ఎందుకు వస్తుందని నమ్ముతారు? 15 రోజుల అన్సార్ కాలం విశిష్టత ఏమిటి? పూర్తి వివరాలు తెలుసుకోండి.ఒడిశాలోని పూరీ శ్రీ జగన్నాథ ఆలయంలో ఈరోజు అత్యంత పవిత్రమైన ‘దేవ స్నాన పూర్ణిమ’ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజున శ్రీ జగన్నాథ స్వామి, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్ర దేవికి 108 పవిత్ర కుండల నీటితో మహాభిషేకం చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి చెందిన జగన్నాథ రథయాత్రకు నాంది పలికే తొలి ప్రధాన ఆధ్యాత్మిక వేడుకగా ఈ ఉత్సవాన్ని భావిస్తారు. ఈ మహాస్నానం అనంతరం స్వామివారు అనారోగ్యానికి గురవుతారని విశ్వాసం. అందుకే తదుపరి 15 రోజుల పాటు భక్తులకు దర్శనం ఉండదు. ఈ విశిష్ట సంప్రదాయం వెనుక ఉన్న ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రత్యేకతలు ఏమిటో తెలుసుకుందాం. జ్యేష్ఠ మాస పౌర్ణమి రోజున జరిగే దేవ స్నాన పూర్ణిమను శ్రీ జగన్నాథ స్వామివారి వార్షిక మహాస్నానోత్సవంగా భావిస్తారు. ఈ సందర్భంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నాన మండపంపై ప్రతిష్ఠించి, వేద మంత్రోచ్చారణల మధ్య 108 పవిత్ర కుండల నీటితో రాజాభిషేకం నిర్వహిస్తారు. ఈ మహోత్సవంతోనే రథయాత్రకు సంబంధించిన ధార్మిక కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమవుతాయి. హిందూ సంప్రదాయంలో 108 సంఖ్య అత్యంత పవిత్రమైనది. జపమాలలో 108 పూసలు, 108 ఉపనిషత్తులు, 108 దైవనామాలు వంటి అనేక ఆధ్యాత్మిక అంశాలకు ఈ సంఖ్యతో సంబంధం ఉంది. అందుకే జగన్నాథ స్వామివారి అభిషేకంలో కూడా 108 కుండల(కలశాల)ను ఉపయోగిస్తారు. ఈ అభిషేకానికి ఉపయోగించే నీటిని ఆలయానికి ఉత్తర భాగంలో ఉన్న బంగారు బావి (సునా కువా) నుంచి సేకరిస్తారు. ఈ బావిని సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే, దేవ స్నాన పూర్ణిమ రోజున తెరిచి పవిత్ర జలాలను తీసుకోవడం ప్రత్యేక సంప్రదాయం.పురాణాల ప్రకారం ఈ బావిని ఇంద్రద్యుమ్న మహారాజు నిర్మించారని విశ్వాసం. నిర్మాణ సమయంలో బంగారు గొలుసులను ఉపయోగించారని చెబుతారు. అందుకే దీనిని బంగారు బావిగా పిలుస్తారు. సుమారు 4 నుంచి 5 మీటర్ల లోతున్న ఈ బావి నుంచి ఆలయ సేవకులు ప్రత్యేక నియమాలను పాటిస్తూ 108 కుండల్లో పవిత్ర జలాలను నింపి అభిషేకం కోసం తీసుకువస్తారు.

దేవ స్నాన పూర్ణిమలో అత్యంత విశిష్టమైన విశ్వాసం ఇదే. 108 కుండల చల్లని పవిత్ర జలాలతో మహాస్నానం చేసిన తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర దేవి అనారోగ్యానికి గురై జ్వరంతో బాధపడతారని భక్తులు నమ్ముతారు. అందుకే స్వామివారిని వెంటనే ప్రజల దర్శనానికి ఉంచకుండా ఏకాంత విశ్రాంతికి తీసుకెళ్తారు. ఈ సమయంలో ఆలయంలో సాధారణ దర్శనాలు నిలిపివేస్తారు. కేవలం ఆలయ సేవకులు మాత్రమే ప్రత్యేక వైద్యం, సేవలు, పూజలు నిర్వహిస్తారు.మహాస్నానం అనంతరం వచ్చే 15 రోజుల కాలాన్ని ‘అన్సార్ కాలం’ అంటారు. ఈ సమయంలో స్వామివారికి ప్రత్యేక ఆయుర్వేద చికిత్సలు, విశ్రాంతి, సేవలు నిర్వహిస్తారని సంప్రదాయం. ఈ కాలంలో భక్తులకు దర్శనం ఉండదు. అనంతరం స్వామివారు ఆరోగ్యంగా కోలుకుని ‘నవయౌవన దర్శనం’ ఇస్తారని విశ్వాసం. ఆ తర్వాతే ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్ర ప్రారంభమవుతుంది.

Vizag Local News

Admin

Copyright © Vizag Local News 2026. All right Reserved.